అక్షరటుడే, న్యూఢిల్లీ: ఆదాయ పన్నును సులభతరం చేసేందుకు నూతన పన్ను విధానాన్ని తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చేవారం పార్లమెంట్‌ ముందుకు కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లు రానుంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లో ఉన్న అనవసర సెక్షన్లు తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. BNS స్ఫూర్తితో కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లు తీసుకొస్తామని సీతారామన్‌ ప్రకటించారు. లిటిగేషన్లు తగ్గించేలా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విధానం ఉంటుందన్నారు. మిడిల్‌ క్లాస్‌ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత పన్ను విధానం అమలు చేస్తామన్నారు. TDSపై మరింత క్లారిటీ ఇస్తామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.