అక్షరటుడే, కోటగిరి: ‘లక్ష డప్పులు – వెయ్యి గొంతుకలు’ సభ పోస్టర్లను ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం మండలకేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాన్సువాడ ఇన్ఛార్జి పోచిరాం మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు నవీన్, జిల్లా నాయకులు లింగన్న, అబ్బయ్య, సాలూర మండలాధ్యక్షుడు శంకర్, మనోహర్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.