అక్షరటుడే, ఎల్లారెడ్డి: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు సంతూర్ ఉమెన్స్ స్కాలర్‌షిప్ కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలిపారు. కళాశాల నుంచి 14 మంది ఎంపిక కాగా, శనివారం వారికి మంజూరు ధ్రువపత్రాలు అందించారు. అలాగే విద్యార్థినులను అభినందించారు. వీరికి ప్రతి నెలా రూ.2వేల చొప్పున మూడేళ్ల వరకు నగదు ప్రోత్సాహకం అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ చంద్రకాంత్, సమన్వయకర్తలు శంకరయ్య, శివ కుమార్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
ఎంపికైన విద్యార్థినులు..
కె.లక్ష్మి, మానస, అశ్రుత, భార్గవి, కవిత, సౌజన్య, అంజలి, శ్వేత, శివాణి, బి గంగోత్రి, మీనాక్షి, వైష్ణవి, ప్రత్యుష, సంధ్య.