అక్షరటుడే, నిర్మల్: బాసర సరస్వతి ఆలయంలో ఆదివారం వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. భక్తుల తాకిడి నేపథ్యంలో అదనంగా నాలుగు అక్షరాభ్యాస మండపాలను ఏర్పాటు చేశారు.