అక్షరటుడే, బాన్సువాడ: ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే భారీ సాంస్కృతిక ప్రదర్శన సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. ఆదివారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోశీరాం, గణేష్, రాజు, ఎడ్ల గంగారాం, అంజయ్య, లాలు, సిద్ధప్ప, సాయిలు, గంగాధర్, సాయిలు, కాశీరాం, హన్మాండ్లు తదితరులున్నారు.