అక్షరటుడే, ఆర్మూర్: నందిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో పలువురి సెల్‌ఫోన్లు రికవరీ చేసినట్లు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. పలు సందర్భాల్లో ఐదుగురు సెల్‌ఫోన్లు పోగొట్టుకోగా.. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్‌ఫోన్లను గుర్తించి ఆదివారం బాధితులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఆయన వెంట ఎస్సై చిరంజీవి ఉన్నారు.