అక్షరటుడే, ఇందూరు: ఇంటర్మీడియట్ అనంతరం ఎన్నో ఉత్తమమైన విద్యావకాశాలు ఉన్నాయని ఎస్ఆర్ విద్యాసంస్థల ఛైర్మన్ వరదా రెడ్డి తెలిపారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో ఎన్ఐఆర్ఎఫ్ గుర్తింపు కలిగిన ఏకైక యూనివర్సిటీ ఎస్​ఆర్​ అన్నారు. బీటెక్ కోర్సులతో పాటు అగ్రికల్చర్, బిజినెస్ స్కూల్, మేజర్ డిగ్రీ, మైనర్ డిగ్రీలు ఒకేసారి పొందే అవకాశం ఉందన్నారు. ఇంటర్నేషనల్ ఇంజినీరింగ్ ప్రోగ్రాంలో భాగంగా మూడు సంవత్సరాలు భారత్​లో, రెండేళ్లు అమెరికాలో కోర్సు పూర్తిచేసే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ అనిత, అడ్మిషన్ డైరెక్టర్ శేషగిరిరావు, సీనియర్ డైరెక్టర్ రామ్ దేశ్​ముఖ్​, నిజామాబాద్ డీజిఎం గోవర్ధన్ రెడ్డి, జోనల్ ఇన్​ఛార్జి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.