అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ పెళ్లి వేడుకలో వరుడు డ్యాన్స్ చేశాడు. అది నచ్చక పెళ్లినే క్యాన్సిల్ చేశాడు మామ(పెళ్లి కూతురు తండ్రి). ఇంతకు ఏం జరిగిందంటే.. పెళ్లి కొడుకు చోలీకే పీఛే క్యాహై పాటకు డ్యాన్స్ చేయడంతో ఇది కాబోయే మామకు నచ్చలేదు. “అలాంటి వాడికి తన బిడ్డను ఇచ్చేది లేదంటూ” పెళ్లిని క్యాన్సిల్ చేశాడు. వరుడు వివరిస్తున్నా వినకుండా మండపం నుంచి ఆడపెళ్లి వారు వెళ్లిపోయారు.