అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్ అరెస్టయ్యారు. కిందిస్థాయి మహిళా ఉద్యోగినులను వేధించిన కేసులో ఆయనపై ఏడు కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. కొద్దిరోజుల క్రితం డీఎంహెచ్‌వో తమను వేధిస్తున్నారని కలెక్టర్ జితేష్ పాటిల్‌కు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగినులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.! ఆయనపై వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ విచారణ చేపట్టి నివేదికను తీసుకున్నారు. కాగా రెండు రోజుల క్రితం డీఎంహెచ్‌వోపై దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని.. ఆయనను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వర్ రావు తెలిపారు. ఆయనను కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు.