అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఇంగ్లండ్ తో జరిగిన ఐదో T20లో టీమిండియా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 4-1 తేడాతో T20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ముందుగా భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అభిషేక్(135) చెలరేగడంతో టీమిండియా 247 పరుగులతో ఇంగ్లండ్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో సాల్ట్ (55) మినహా మిగతా ENG బ్యాటర్లు చేతులెత్తేయడంతో 97 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీ 3, వరుణ్ చక్రవర్తి, దూబే, అభిషేక్ చెరో 2, బిష్ణోయ్ ఒక వికెట్ తీశారు.