అక్షరటుడే, కామారెడ్డి: బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నీలం చిన్న రాజులు నియామకం అయ్యారు. రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ చిన్న రాజులును నియమించగా.. జిల్లా ఎన్నికల అధికారి ఎన్వీఎస్ఎస్​ ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. చిన్న రాజులు మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు. గతంలో కూడా బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేసినా లభించలేదు. ఈసారి చిన్న రాజులుతో పాటు మరొకరు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించగా చివరికి చిన్న రాజులు వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపింది. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.