అక్షరటుడే, వెబ్​డెస్క్​: ప్రపంచ స్టాక్​ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. మెక్సికో, కెనడా, చైనాలపై అమెరికా సుంకాల ఎఫెక్ట్​తో మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. అమెరికా ఫ్యూచర్స్​ భారీ నష్టాల్లో ముగిశాయి. జపాన్, దక్షిణ కొరియా సూచీలు మూడు శాతం పడిపోయాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో భారత మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్​ 449 పాయింట్ల నష్టంతో 77,056 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 162 పాయింట్లు నష్టంతో 23,319 వద్ద ట్రేడ్​ అవుతోంది. బ్యాంక్​, ఐటీ స్టాక్స్​ భారీగా నష్టపోయాయి.