అక్షరటుడే, వెబ్డెస్క్: కులగణనపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని ఆమె విమర్శించారు. రాష్టంలో 3.70 కోట్ల జనాభా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోందని, బీఆర్ఎస్ హయాంలో 2014లో సకల జనుల సర్వే చేసినప్పుడు 3.68 కోట్ల జనాభా ఉందన్నారు. పదేళ్లలో రెండు లక్షల జనాభా మాత్రమే పెరిగిందా అని ఆమె ప్రశ్నించారు. దీని ప్రకారం సర్వే సక్రమంగా జరగలేదని తెలుస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెబుతున్నట్లు బీసీలు 46శాతం, ముస్లిం బీసీలు 10శాతం కలిపి 56శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని కోరారు.