అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఫామ్‌హౌస్‌లో రహస్యంగా భేటీ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఓ మంత్రిపై అసమ్మతితో ఎమ్మెల్యేలు సమావేశం అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి దగ్గరకు చేరింది. దీంతో భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలతో ఆమె ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. ఈ నెల 5న తాను తెలంగాణకు వస్తానని, అప్పటి వరకు ఈ అంశంపై మాట్లాడొద్దని చెప్పినట్లు సమాచారం. ఇదే విషయమై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడారు.