అక్షరటుడే, ఆర్మూర్‌: ఆటో టైరుపేలి చెట్టుకు ఢీకొన్న ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. బుస్సాపూర్‌ నుంచి మెండోరా వెళ్తుండగా సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆటోలోని ఆరుగురు వ్యక్తులతో పాటు నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.