అక్షరటుడే, ఇందూరు: అగ్రవర్ణాలపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ యువ నాయకుడు రాజశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వీడియో విడుదల చేశారు. కలిసికట్టుగా ఉన్న హిందువుల మధ్య చిచ్చు పెట్టేందుకే మల్లన్న ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు మల్లన్న జైలులో ఉన్నప్పుడు ఆయనను విడిపించింది బీసీబిడ్డ ఎంపీ అర్వింద్‌ కాదా అని పశ్న్రించారు. జైలు నుంచి బయటకొచ్చాక కృతజ్ఞత మరిచిపోయిన వ్యక్తి మల్లన్న అని ఆయన దుయ్యబట్టారు. బీసీ నాయకుడినని చెప్పుకుంటూ కాంగ్రెస్‌ పార్టీకి దొంగచాటుగా మద్దతునిస్తూ అగ్రవర్ణాలను దూషిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అవసరాన్ని బట్టి ఊసరవెల్లిలా రంగులు మార్చే మల్లన్నను బీసీ ప్రజలు నమ్మబోరన్నారు. మల్లన్నకు ధైర్యం ఉంటే బీసీ నినాదంతో నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని.. తాము ఎంపీ అర్వింద్‌ మద్దతుతో మీకంటే ఎక్కువ సీట్లు వచ్చేవిధంగా కృషి చేస్తామని సవాల్‌ విసిరారు.