అక్షరటుడే, నెట్​వర్క్​: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సరస్వతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, కుంకుమపూజలు నిర్వహించారు. భక్తులు సరస్వతి మాతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.