అక్షరటుడే, వెబ్​డెస్క్​: బడ్జెట్​లో రైల్వేశాఖ కేటాయింపులపై ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​ వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్​లకు భారీగా నిధులు కేటాయించామని పేర్కొన్నారు. ఏపీకి రూ.9,147 కోట్లు, తెలంగాణకు రూ.5,337 కోట్లు బడ్జెట్​లో కేటాయించినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వందే భారత్​ రైళ్లు నడుపుతామని కేంద్ర మంత్రి తెలిపారు. నవ భారత్‌ రైళ్లను విజయవాడ-హైదరాబాద్‌ మధ్య నడపాలని నిర్ణయించామని పేర్కొన్నారు.