అక్షరటుడే, మోపాల్‌: మండలంలోని న్యాల్‌కల్‌లో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. గౌడ కులస్థుల ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకు రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హాజరయ్యారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్‌ గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్‌ శేఖర్‌ గౌడ్, నరేష్, గంగాధర్, ప్రసాద్, తదితరులున్నారు.