అక్షరటుడే, నిజాంసాగర్‌: మహమ్మద్‌ నగర్‌ మండలంలో అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని ఆలిండియా అంబేద్కర్‌ యువజన సంఘం సభ్యులు కోరారు. సోమవారం తహసీల్దార్‌ సవాయిసింగ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షుడు రాము, ఉపాధ్యక్షుడు సాయిలు, కోశాధికారి ఎడ్ల సాయిలు, కార్యదర్శి సుభాష్, తదితరులు ఉన్నారు.