అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి సబ్ జైలును జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్ సోమవారం పరిశీలించారు. జైలులో ఖైదీల భోజన వసతులు, న్యాయసేవలు, ఆరోగ్య సమస్యలపై తెలుసుకున్నారు. జైలులో గార్డెనింగ్ నిర్వహణపై అధికారులను అభినందించారు. అనంతరం పలు రికార్డులు తనిఖీ చేశారు. ఎస్పీ సింధుశర్మ, ఏఎస్పీ చైతన్యరెడ్డి, సబ్ జైలు అధికారి ఆనంద్ రావు, పర్యవేక్షణ అధికారి సంజీవరెడ్డి ఉన్నారు.