అక్షరటుడే, కోటగిరి: పోతంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. భక్తులకు ప్రవచనాలు వినిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.