అక్షరటుడే, ఇందూరు: ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య హామీ ఇచ్చారు. తపస్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణవేణి, బద్రీనాథ్ వెంకట్రావు, రామకృష్ణారెడ్డి, కీర్తి సుదర్శన్, ఆయా మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.