అక్షరటుడే, హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ నివేదిక వచ్చింది. నాలుగు కేటగిరీలుగా విభజించాలని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4 కేటగిరీలకు కమిషన్‌ రిజర్వేషన్‌ శాతం సిఫార్సు చేసింది. మొదటి కేటగిరీలో అత్యంత వెనుకబడిన ఉపకులాలు, రెండో కేటగిరీలో మాదిగ, మాదిగ ఉపకులాలు, మూడో కేటగిరిలో మాల, మాల ఉపకులాలు, నాలుగో కేటగిరిలో ఇతర ఉపకులాలుగా విభజించాలని సూచించినట్లు సమాచారం.