అక్షరటుడే, వెబ్​డెస్క్​: ప్రముఖ నిర్మాత దిల్​ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు విచారణకు రావాలని అధికారులకు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆయన డాక్యుమెంట్లు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఇతర లావాదేవీలను ఐటీ అధికారులకు అందజేసినట్లు సమాచారం.