అక్షరటుడే, వెబ్​డెస్క్​: హైదరాబాద్​లో సర్వే అధికారులపైకి కొందరు కుక్కలను వదిలారని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వే నిష్పాక్షికంగా నిర్వహించామని తెలిపారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో వంద శాతం సర్వే జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. కావాలనే కొంతమంది హైదరాబాద్​లో సర్వేలో పాల్గొనలేదని, మరికొందరు సర్వే సిబ్బందిపైకి కుక్కలను వదిలారని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందని చెప్పారు.