అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: రథసప్తమి వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని నీలకంఠేశ్వరాలయం కిటకిటలాడింది. ఉదయం నుంచి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. పండితులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సాయంత్రం నిర్వహించనున్న రథయాత్ర కోసం అలంకరణ చేశారు.