అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు పోగొట్టుకున్న ఫోన్లన రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్లను రికవరీ చేసి మంగళవారం బాధితులకు అందజేశారు. ఫోన్లు పట్టుకోవడంలో ప్రత్యేకంగా కృషి చేసిన కానిస్టేబుల్ యాస్మిన్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.