అక్షరటుడే, వెబ్‌డెస్క్: రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. శంకర్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా జనవరి 10న విడుదలైన విషయం తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అనుకున్నంత కలెక్షన్లు రాబట్టలేకపోయింది. రామ్‌చరణ్ తన నటనతో ఆకట్టుకున్నా.. సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది.