అక్షరటుడే, ఇందూరు: శాసనమండలి, ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలను పురస్కరించుకొని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం బోధన్‌లో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ల సంఖ్యను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అన్ని కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అధికారులు ఉన్నారు.