అక్షరటుడే, వెబ్​డెస్క్​: నీట్ పీజీ సీట్ల భర్తీ అవకతవకలపై సుప్రీంకోర్టు మంగళవారం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(MCC), కేంద్ర ప్రభుత్వం, జాతీయ వైద్య కమిషన్(NMC)లకు నోటీసు జారీ చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజీ అడ్మిషన్లను నిర్ణయించే నీట్ పీజీకి హాజరైన అభ్యర్థులకు ఆల్ ఇండియా కోటా (AIQ) సీట్ల కోసం జరిగిన మూడో రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై పిటిషన్ దాఖలైంది. న్యాయమూర్తులు BR గవై, K వినోద్ చంద్రన్​తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ పై విచారణ చేపట్టింది. MCC, NMC, కేంద్ర ప్రభుత్వం వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.