అక్షరటుడే, హైదరాబాద్‌: దేశ చరిత్రలో.. రాష్ట్రంలో చేసిన కులగణనే అధికారిక సర్వే అని.. ఇది దేశానికే రోల్ మోడల్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కులగణన ఆధారంగా సీట్లు ఇస్తామని చెప్పారు. అధికారికంగా కులగణన అమలు చేసే బాధ్యత బీసీ కమిషన్ దే అని సీఎం స్పష్టం చేశారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడారు.