వలసదారులను వెనక్కి పంపుతున్న వైనం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: అమెరికాకు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక.. భారత్​కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఇండియాకు మరో షాక్‌ తగిలింది. అక్రమంగా వలసవచ్చిన భారతీయులను ఇండియాకు పంపించేస్తోంది. మొత్తం 205 మందితో టెక్సాస్ నుంచి సీ-17 మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ బయలుదేరింది. సుమారు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు అమెరికా గుర్తించింది. డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వరుసగా అందరినీ వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.