అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలో ఎంసీహెచ్ ఆస్పత్రిలో ఇటీవల నిర్మించిన తాత్కాలిక షెడ్​ను మంగళవారం డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏరియా ఆస్పత్రి నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో రోగుల సౌకర్యార్థం ఎంసీహెచ్​ ఆస్పత్రి కోసం తాత్కాలికంగా షెడ్​ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.