అక్షరటుడే, కామారెడ్డి: క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా త్వరగా చికిత్స తీసుకోవడం వల్ల విముక్తి పొందవచ్చని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఫరీదా బేగం తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఆస్పత్రిలో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్యాన్సర్ సంబంధిత లక్షణాలను ముందుగానే గుర్తిస్తే చికిత్స తీసుకుని విముక్తి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, డిస్ట్రిక్ట్ ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ శిరీష, పాలేటివ్ కేర్ మెడికల్ ఆఫీసర్ గణశ్యామ్, నర్సింగ్ ఆఫీసర్స్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.