అక్షరటుడే, వెబ్​డెస్క్​: వికసిత్‌ భారత్‌ తమ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో ప్రధాని లోక్ సభలో ప్రసంగించారు. మూడోసారి దేశ ప్రజలు తమను ఆశీర్వదించారని పేర్కొన్నారు. దేశాభివృద్ధి కోసం పనిచేస్తున్నామన్నారు. గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చామని తెలిపారు. ఐదేళ్లలో 12 కోట్ల మందికి తాగునీటి వసతి కల్పించామని వివరించారు. నాలుగు కోట్ల మంది పేదలకు గృహ వసతి కల్పించామని చెప్పారు. స్వచ్ఛభారత్​ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. చెత్త నుంచి సంపదను సృష్టిస్తున్నామని తెలిపారు. డిజిటల్​ లావాదేవీలతో పారదర్శకతను తీసుకువచ్చామని చెప్పారు.