అక్షరటుడే, కోటగిరి: వైరస్​తో కోళ్లు మృతి చెందిన ఘటన పోతంగల్ మండలం చైతన్య నగర్​లో చోటు చేసుకుంది. జల్లపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా రవి చైతన్య నగర్​లోని ఓ కోళ్లఫాంను లీజుకు తీసుకొని నడుపుతున్నాడు. సోమ, మంగళవారాల్లో కలిపి సుమారు 4,500కు పైగా కోళ్లు మృతి చెందినట్లు బాధితుడు తెలిపాడు. రూ.7 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు.