అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మరోసారి భారీగా ఫారిన్ గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న 5 ట్రాలీ బ్యాగుల్లో గంజాయిని గుర్తించారు. రూ.47 కోట్ల విలువైన ఫారిన్ గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.