అక్షరటుడే, వెబ్​డెస్క్​: పసిడి ధర పరుగులు పెడుతోంది. గురువారం ఆల్​టైం హైకి చేరింది. హైదరాబాద్​ బులియన్​ మార్కెట్​లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,040 పెరిగి రూ.86,240 పలుకుతోంది. 22 క్యారెట్ల రేటు రూ. 950 పెరిగి రూ.79,050లకు చేరింది. ఇక కేజీ వెండి సైతం రూ.1,07,000లకు పెరిగింది.