అక్షరటుడే, వెబ్‌డెస్క్: బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ మరోమారు హల్చల్ చేసింది. ఇద్దరు యువకులపై దాడిచేసి గాయపర్చింది. రెండు రోజుల వ్యవధిలో బెజవాడలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం. శ్రీకాంత్, మనోహర్ అనే యువకులపై బ్లేడ్ బ్యాచ్ సభ్యులు దాడి చేశారు. కాగా, పోలీసులు బ్లేడ్ బ్యాచ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.