అక్షరటుడే, వెబ్​డెస్క్​: మహబూబాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని సీరోల్ మండల కేంద్రంలో ఉన్న ఏకలవ్య గురుకులంలో సాంస్కృతిక కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ రోజా అనే ఇంటర్ ఫస్టియర్ సీఈసీ విద్యార్థిని కుప్పకూలి పడిపోయింది. వెంటనే ఉపాధ్యాయులు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి విద్యార్థిని మృతి చెందింది. రోజా స్వస్థలం మరిపెడ మండలం తానంచర్ల శివారు సపవత్ తండా. కార్డియాక్ అరెస్ట్ వల్ల విద్యార్థిని చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.