అక్షరటుడే ఇందల్వాయి: రానున్న స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటుదామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రెండో సారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు బుధవారం ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద బీజేపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు లోలం సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు నాయుడు రాజన్న, శ్రావణ్, కేపీ రెడ్డి, శ్రీనివాస్ వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.