అక్షరటుడే, వెబ్డెస్క్: హైదరాబాద్ ఎల్బీ నగర్లో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్ కోసం తీసిన సెల్లార్లో పిల్లర్స్ కోసం పనులు చేస్తుండగా గోడ కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు బీహార్ నుంచి వచ్చిన కూలీలుగా గుర్తించారు. వారిని కాంట్రాక్టర్ అడ్డా మీద నుంచి తీసుకొచ్చి పనులు చేయిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.