అక్షరటుడే, వెబ్డెస్క్: ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు ప్రధాని మోదీ బుధవారం ఉదయమే చేరుకున్నారు. అనంతరం కుంభమేళాలోని అరైల్ ఘాట్లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం గంగానదికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.