అక్షరటుడే, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ సెంటర్లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కానున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ హాజరుకానున్నారు.