అక్షరటుడే, కామారెడ్డి: స్వదేశీ జాగరణ మంచ్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మేళా పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. భిక్కనూరు సౌత్‌ క్యాంపస్‌లో ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ గౌడ్‌ వీటిని ఆవిష్కరించారు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో ఈనెల 11 నుంచి 16 వరకు నిర్వహించే మేళాలో స్వదేశీ సంబంధ అంశాలపై అవగాహన కార్యక్రమం, స్టాళ్ల ప్రదర్శన ఉంటుందన్నారు. కార్యక్రమంలో జాగరణ మంచ్‌ జిల్లా కన్వీనర్‌ రాహుల్‌కుమార్, విభాగ విచారక్‌ యాలాద్రి, సంఘర్షణ ప్రముఖ్‌ సంతోష్‌గౌడ్, మెదక్‌ జిల్లా కన్వీనర్‌ నారాయణ పాల్గొన్నారు.