అక్షరటుడే, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నేడు దీపాదాస్ మున్షీ భేటీ కానున్నారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో మున్షీ విడివిడిగా మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4:15 గంటలకు కరీంనగర్, వరంగల్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. సాయంత్రం 5:30కి నల్గొండ, హైదరాబాద్, మెదక్ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. 6:45కి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఎమ్మెల్యేల రహస్య భేటీ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా.. స్థానిక సంస్థలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.