అక్షరటుడే, వెబ్డెస్క్: టీకా వికటించి శిశువు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లలిత – రమేష్ దంపతులు 45 రోజుల వయసు గల తమ కూతురుకు స్థానిక పీహెచ్సీలో టీకా వేయించారు. ఇంటికి వెళ్లాక చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే పాప మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. పాప మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుబుంబ సభ్యులు పీహెచ్సీ ఎదుట ఆందోళన చేపట్టారు.