అక్షరటుడే, వెబ్​డెస్క్​: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. జనవరి 26న ప్రభుత్వం ప్రాతిష్టాత్మకంగా నాలుగు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జనవరి 27న మండలానికి ఓ గ్రామం చొప్పున రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మళ్లీ బుధవారం 21,45,330 మంది అన్నదాతలకు రైతు భరోసా జమ చేసింది. రూ.1,126 కోట్లు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొదట చిన్న రైతులకు మాత్రమే రైతు భరోసా జమ చేస్తున్నట్లు సమాచారం.