అక్షరటుడే, వెబ్​డెస్క్​: జాతరలో ఓ మహిళపై ఎస్సై చేయి చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. నార్కట్​పల్లి మండలం చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చెరువు గట్టు జాతరగా పిలిచే ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు వస్తారు. ఈ క్రమంలో జాతరలో ఓ మహిళపై నల్గొండ రూరల్​ ఎస్సై సైదాబాబు చేయి చేసుకున్నాడు. ఆమెను తోసేసి, దురుసుగా ప్రవర్తించాడు. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.